తాటిపర్తి గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

తాటిపర్తి గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

NLR: పొదలకూరు మండలంలోని తాటిపర్తి గ్రామం నుంచి తిరుమలకు బుధవారం పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. ఈ భక్తులు రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు మీదుగా ప్రయాణాన్ని సాగిస్తారు. మూడవరోజు సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ భక్తులు ప్రతి సంవత్సరం తిరుమలకు పాదయాత్రగా వెళుతూ ఉంటారని నిర్వాహకులు తెలియజేశారు.