53 మందికి CMRF చెక్కుల పంపిణీ

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన 53 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పంపిణీ చేశారు. పది లక్షల 57 వేల 500 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు అందించడం తనకు సంతృప్తిగా ఉందని చెప్పారు.