చింతకుంట్లరామయ్యపల్లి పై పోలీసుల ప్రత్యేక దృష్టి
BHPL: చిట్యాల మండలం చింతకుంట్లరామయ్యపల్లి గ్రామ పంచాయతీని సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రతిసారీ ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇవాళ పోలీసులు, అల్లర్లు, గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.