'మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందజేత'
VSP: సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన బోయివీధికి చెందిన సురివిన వీర్రాజు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తగరపువలసలో అందజేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ఆనందపురం బోని గ్రామానికి చెందిన కనకల ప్రసాద్ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఎంవీపీ కాలనీ కార్యాలయంలో ఆదివారం అందించారు.