న్యూ శాంపేట 31వ డివిజన్‌ను బీఆర్ఎస్ విస్మరించింది: MLA
HNK: జిల్లా కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హనుమకొండ మున్సిపాలిటీలోని న్యూ శాంపేట 31వ డివిజన్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎస్సీ కాలనీకి ఆనాటి ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా వెళ్లలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి బాట పట్టిందని ఆయన అన్నారు.