రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ప్రకాశం: పెద్దారవీడు మండలం బి. చెర్లోపల్లి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.