52వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు సన్నాహాలు

52వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు సన్నాహాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని భారతీయ నాటక కళాసమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా 52వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు అప్సర్ తెలిపారు. ఫిబ్రవరి 11నుంచి 15వరకు పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటకాల ఎంపిక, వేదిక ఏర్పాట్లపై చర్చించారు.