VIDEO: కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

VIDEO: కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

సత్యసాయి: పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి గ్రామంలో ఒక విద్యుత్ స్తంభం పడిపోవడానికి సిద్ధంగా ఉండటం గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. స్తంభం పూర్తిగా వంగి ఉండటంతో ఎప్పుడైనా కూలిపోవచ్చని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆ విద్యుత్ స్తంభాన్ని మరమ్మతు చేయాలని లేదా కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.