రేపు జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు
GDL: షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నామని షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ మెన్స్, ఉమెన్స్ ఎంపికలు నిర్వహిస్తామని, ఆసక్తి గల క్రీడాకారులు ఈ సెక్షన్‌లో పాల్గొనాలని అన్నారు. మరిన్ని వివరాల కోసం 6304246503కు సంప్రదించాలన్నారు.