VIDEO: సంచరిస్తున్న చిరుత పులి.. భయాందోళనలో భక్తులు
NDL: శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద ఓ చిరుత పులి సంచరిస్తున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ స్ఫూర్తి ప్రధాన రహదారి పక్కన రాత్రి 11 గంటల సమయంలో డివైడర్‌పై నుంచి వెళుతున్న చిరుతపులిని భక్తులు గమనించి వీడియో తీసారు. అనంతరం చిరుతపులి అడవిలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ చిరుతపులిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు.