VIDEO: కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: మార్కాపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుపతి ప్రవచనకర్త అకెళ్ళ విభూషణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదయిందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మార్కాపురం చెరువు నిండిదన్నారు.