ముక్తేశ్వరం కూరగాయల మార్కెట్ వద్ద అపారిశుధ్యం
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కూరగాయల మార్కెట్ వద్ద అపారిశుధ్యం తాండవిస్తుందని స్థానికులు అంటున్నారు. పక్కనే ఉన్న పంట కాలువలోకి చెత్తాచెదారం పాడేయడంతో అవి కుళ్ళిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నాయని అంటున్నారు. ఈగలు, దోమలు పెరిగిపోవడంతో విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.