బూర్జలో నిరుపయోగంగా ప్రజా మరుగుదొడ్లు

బూర్జలో నిరుపయోగంగా ప్రజా మరుగుదొడ్లు

SKLM: బూర్జ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన సుమారు 30 మరుగుదొడ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణ లేక మరుగున పడిపోయాయి. చుట్టూ పిచ్చిమొక్కలు అల్లుకుని అధ్వానంగా మారాయని స్థానికులు అంటున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.