'జనవాణి ద్వారా సమస్యలను పరిష్కరిస్తాం'

'జనవాణి ద్వారా సమస్యలను పరిష్కరిస్తాం'

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19వ తేదీన జనవాణి కార్యక్రమం క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.