'ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి'

'ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి'

MDK: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.