జిల్లాలో రెండో విడత ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

జిల్లాలో రెండో విడత ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

WGL: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల కోలాహలంతో మార్మోగుతోంది. గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో డిసెంబరు 14న జరగనున్న పోలింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద ప్రత్యక్షంగా పరిశీలించారు. గీసుకొండ మండలంలోని పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అకస్మాత్తుగా సందర్శించి, ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.