తాండ్రలో పర్యటించిన కలెక్టర్
NGKL: కల్వకుర్తి మండలం తాండ్రలో కలెక్టర్ బదవత్ సంతోష్ శనివారం పర్యటించారు. గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.