రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తి మృతి
NGKL: కోటాలగడ్డ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల శ్రీనివాసులు (43) మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న ఆయన్ను మొదట కారు ఢీకొట్టింది. కిందపడిన అతనిపై నుంచి డీసీఎం వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.