గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై జేసీ హెచ్చరిక

గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై జేసీ హెచ్చరిక

సత్యసాయి: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్యాస్ డీలర్లను బుధవారం ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు ఒకసారిగా నిర్ణయించినట్లు తెలిపారు.