VIDEO: దుద్దుకూరు శివాలయంలో ప్రత్యేక పూజలు
BPT: ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలోని శివాలయంలో ఆదివారం మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం బిల్వదళాలతో అర్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చక స్వామి సురేష్ బాబు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.