మార్కండేయ ప్రాంగణంలో సంతరించుకున్న కార్తీక శోభ
SRD: ఖేడ్ పట్టణంలో సోమవారం రాత్రి కార్తీకదీపారాధన మహోత్సవం నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమా మహేశ్వర శాంతి కళ్యాణం వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపోత్సవం వేదికలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓం, స్వస్తిక్, శివ లింగం ఆకారంలో దీపాల ప్రమిదలు అలంకరించి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా కార్తిక శోభ సంతరించుకుంది.