రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

SDPT: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతిచెందిన ఘటన మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో జరిగింది. దుబ్బాక సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ప్రణతి, సాయి కుమార్‌లకు ఇటీవల వివాహమైంది. ఉద్యోగ నిమిత్తం వారిద్దరూ బైక్‌పై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. 108 వాహనంలో తరలించే క్రమంలో ప్రణతి మృతి చెందగా.. సాయి కుమార్ చికిత్స పొందుతున్నారు.