ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
GNTR: 2025–27 సంవత్సరానికి ఫిరంగిపురం మండల ఏపీటీఎఫ్ కొత్త కార్యవర్గాన్ని మంగళవారం సభ్యులు ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు సయ్యద్ జహంగీర్, ప్రధాన కార్యదర్శిగా టి. భాస్కర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండలంలో జరిగే కోఆర్డినేషన్ సమావేశాలకు తమను ఆహ్వానించాలంటూ ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీవోను కలిసి నూతన కార్యవర్గ నివేదికను అందజేశారు.