నిబంధనలు వీడొద్దు.. ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు: ఎస్సై
SRPT: ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడమే పోలీసుల ధ్యేయమని ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పేర్కొన్నారు. ‘అరైవ్-అలైవ్’లో భాగంగా ఈరోజు కోదాడలో మున్సిపల్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు విధిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు.