ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
PDPL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వి. వాణిశ్రీ పట్టణంలోని ఉమ డెంటల్ క్లినిక్, లోటస్ హాస్పిటల్‌లను తనిఖీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–2010 ప్రకారం అన్ని వైద్య కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నమోదు లేకుండా వైద్య సేవలు నిర్వహించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.