సమ్మె ఎఫెక్ట్.. రేట్లు పెంచిన ఆటోలు
HYD: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి భారీగా రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఓ వైపు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు.