బేతంచెర్లలో బండలాగుడు పోటీలు
NDL: బేతంచెర్లలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఆలయ కమిటీ, రైతు సంఘం నాయకులు ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. రైతులు, యువకుల కేరింతల మధ్య పోటీలు ఉత్కంఠగా సాగాయి. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.