సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్

AKP: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నర్సీపట్నంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.7,31,780 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 109 మందికి రూ.1.05 కోట్లకు పైగా సహాయం అందించామన్నారు. పేదల పాలిట సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిలుస్తోందన్నారు.