VIDEO: గచ్చుబావిలో భక్తుల శ్రమదానం

VIDEO: గచ్చుబావిలో భక్తుల శ్రమదానం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన గచ్చుబావి శివాలయం శిథిలావస్థకు చేరి, చెత్త చెదారంతో నిండిపోయింది. దీనిని పునరుద్ధరించే లక్ష్యంతో సేవ్ గచ్చుబావి కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. గత మూడు రోజులుగా శ్రమదానం ద్వారా చెత్తను తొలగిస్తున్నారు. ఈరోజు ఉదయం శివ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.