వాహనాల తనిఖీలు చేపట్టిన సీఐ

కోనసీమ: రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ CH. విద్యా సాగర్ ఆధ్వర్యంలో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా వాహనాలు తనిఖీ చేసి రికార్డులు లేని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మద్యం సేవిస్తూ వాహనాలు నడపడం నేరమని తెలిపారు.