గిట్టుబాటు ధర లేక అరటి రైతుల ఆందోళన

గిట్టుబాటు ధర లేక అరటి రైతుల ఆందోళన

ATP: జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో అరటి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు దారుణంగా పడిపోవడంతో కాయలు కోయకుండా చెట్లపైనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.