పొన్నలూరు సహకార బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు

ప్రకాశం: పొన్నలూరు సహకార బ్యాంక్ ఛైర్మన్ సోమవారం కొండలరావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొండలరావును సహకార బ్యాంక్ ఛైర్మన్ నియమించిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్లుగా ఎరుకలరెడ్డి, బ్రహ్మయ్యలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. తాను సహకార బ్యాంకు బలోపేతానికి కృషి చేస్తానన్నారు.