VIDEO: బీహార్‌లో విజయం.. పామూరులో సంబరాలు
ప్రకాశం: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల పామూరు పట్టణంలో బీజేపీ నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని శ్రీనివాసరావు అన్నారు.