లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: కావలిలోని బుడంగుంట 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.