భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి: కలెక్టర్
SKLM: జలుమూరు(M) శ్రీముఖలింగంలో ఆదివారం నిర్వహించునున్న బాలియాత్ర నిర్వహణ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునకర్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి ఉన్నారు.