VIDEO: అనుమానాస్పద స్థితిలో పత్తి దగ్ధం
KMR: పెద్ద కొడఫ్గల్ మండలంలోని సముందర్ తండా గ్రామంలో రేకుల షెడ్డులోని పత్తి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. ఇందిరాబాయి సుమారు నాలుగు ఎకరాల భూమిలో పండిన పత్తి పంటను రేకుల షెడ్డులో నిల్వ చేసింది. నిన్న రాత్రి షెడ్డు నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి మంటలు ఆర్పారు. సుమారు రూ. రెండున్నర లక్షల నష్టం వాటిల్లిదన్నారు.