VIDEO: 'అక్రమంగా మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి'
ELR: జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో ఆదివారం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు అందుబాటులో ఉండరు అని, అక్రమ మట్టి తవ్వకాలకు తెర తీసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు స్పందించి అక్రమంగా మట్టి తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని స్థానికులు తెలుపుతున్నారు.