'తల్లిదండ్రులు మానసిక స్థితిని అంచనా వేయాలి'

NLG: యువత మానసిక స్థితిని తల్లిదండ్రులు,ఎప్పటికప్పుడు అంచనా వేయాలని నల్గండ జిల్లా సైకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. పిల్లలు, యువత తమ చదువులు, ఉద్యోగాల్లో ఒత్తిడికి గురవుతున్నారా అనేది గమనించాలి. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, దురలవాట్లకు దగ్గర కావడం, మునుపటిలా లేకుండా ముభావంగా ఉండడం, తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే మానసిక నిపుణుడి సంప్రదించాలన్నారు.