విద్యార్థినిలకు పారిశుద్ధ్య డ్రైవ్

విద్యార్థినిలకు పారిశుద్ధ్య డ్రైవ్

NLG: వలిగొండ (బీబీనగర్ క్యాంపస్)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను ప్రిన్సిపల్ ఎస్. రూప ప్రారంభించారు. విద్యార్థినులకు పారిశుద్ధ్య డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.