జవహర్ నగర్‌లో రూ.66 వేలు పలికిన గణపతి లడ్డు

మేడ్చల్: జవహర్ నగర్ పరిధి ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పాతబస్తీలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాటలో రూ.66 వేలు పలికింది. ఈ వేలంలో జిట్టా శ్రీనివాస్ అనే వ్యక్తి లడ్డూ కైవసం చేసుకున్నట్లుగా గణపతి కమిటీ సభ్యులు తెలిపారు. గణపతి లడ్డూ కైవసం చేసుకున్న ప్రతిసారి ఇంట్లో కుటుంబమంతా ఆయురారోగ్యంతో ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.