DAR హెడ్‌క్వార్టర్స్‌ను పరిశీలించిన ఎస్పీ
VKB: జిల్లా డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌ను ఎస్పీ స్నేహ మెహ్రా సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మరీ, డ్యూటీ రూమ్స్, క్యాంటీన్, వాటర్ ప్లాంట్ తదితర విభాగాలను తనిఖీ చేసి పనితీరును సమీక్షించారు. శుద్ధ తాగునీరు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. DAR జిల్లా భద్రతకు కీలకమని, సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు.