‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ
PPM: సీతానగరం మండలం పాపంవలస గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.