కిశోరి వికాసంపై అవగాహన

NLR: కోవూరు మండలం వేగూరు సీతారామపురం అంగన్వాడీ కేంద్రంలో కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బాలల హక్కులు, పోక్సో చట్టం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. బాలలు, బాల కార్మికులుగా ఉండకుండా బాగా చదువుకోవాలని సూపర్వైజర్ ప్రమీల సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వసంతమ్మ, వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.