VIDEO: వాడపల్లి క్షేత్రంలో డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యటించారు. ఆలయ మాడ వీధులను ఆయన స్వయంగా పర్యవేక్షించి, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.