జిల్లా హాస్పిటల్ రోడ్డును పరిశీలించిన కలెక్టర్

SKLM: టెక్కలి మండలం స్థానిక జిల్లా హాస్పిటల్‌కి నూతనంగా నిర్మించిన రోడ్డు మార్గమును శనివారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే కాంపౌండ్ వాల్ నిర్మించాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డిఓ ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీవో లక్ష్మీబాయి పాల్గొన్నారు