న్యూసెన్స్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు

న్యూసెన్స్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు

AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ శివారులో మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్సై వై.తారకేశ్వరరావు తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. దీంతో మేజిస్ట్రేజ్ ఒక్కొక్కరికి రు.1,000 జరిమాన విధించినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి న్యూసెన్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.