అందెశ్రీ మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ MLA

అందెశ్రీ మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ MLA

NLG: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మృతి పట్ల నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం ప్రజలను చైతన్యం చేయటంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'ను రాసిన అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.