బొగ్గు, గనుల శాఖ సమావేశంలో డా. రవి కుమార్ గౌడ్
SRD: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ సమావేశంలో ఆ శాఖ అఫిషియల్ లాంగ్వేజెస్ సభ్యుడు కంగ్టి మండలానికి చెందిన డాక్టర్ జి.రవి కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అధునాతన భూభౌతిక సర్వేల వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మిషన్ మోడ్లో ఖనిజాన్వేషణ సాగిస్తున్న తీరును చర్చించినట్లు పేర్కొన్నారు.