రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలి: JC

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలి: JC

జనగామలో అంబేద్కర్ జయంతిని మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ముఖ్య అతిథిగా హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి వంటిదన్నారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు.