బస్సుల కోసం భక్తుల పాట్లు

బస్సుల కోసం భక్తుల పాట్లు

ప్రకాశం: కడప జిల్లాలో బ్రహ్మంగారి ఆరాధన కార్యక్రమం నేపథ్యంలో భక్తులు బ్రహ్మంగారి మఠంకు వెళ్లేందుకు భారీగా గిద్దలూరుకు చేరుకున్నారు. మంగళవారం బస్టాండ్ నుంచి వెళ్లేందుకు భక్తులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూశారు. ఒకపక్క భక్తులకు సరైన వసతులు లేక ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.